వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, నవంబర్ 12 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా కావలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సుబ్బారావు ఇటీవల దాడికి గురైన నేపథ్యంలో ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
- దాడి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా ఆత్మకూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు షేక్ చాంద్ బాషాతో పాటు AI MEJA, APMF జర్నలిస్టు యూనియన్ల నాయకులు షుకూర్, సీహెచ్ నరసింహులు, నాగేంద్రుడు తదితరులు సుబ్బారావును కలిసి పరామర్శించారు.
దాడి ఘటనపై ఆరా.. పాత్రికేయుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి
ఆత్మకూరు, నవంబర్ 12 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా కావలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సుబ్బారావు ఇటీవల దాడికి గురైన నేపథ్యంలో ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు. దాడి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆత్మకూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు షేక్ చాంద్ బాషాతో పాటు AI MEJA, APMF జర్నలిస్టు యూనియన్ల నాయకులు షుకూర్, సీహెచ్ నరసింహులు, నాగేంద్రుడు తదితరులు సుబ్బారావును కలిసి పరామర్శించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పాత్రికేయులపై దాడులు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సమాచారాన్ని అందించే జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సంబంధిత అధికారులపై ఉందన్నారు. పాత్రికేయుల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తోటి పాత్రికేయులు, వివిధ యూనియన్ల నాయకులు రాజకీయ, సంఘ విభేదాలకు అతీతంగా ఐక్యంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుల హక్కులు, భద్రత పరిరక్షణ కోసం సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు సుబ్బారావుకు తమ సంపూర్ణ మద్దతు, సంఘీభావం ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Convert to PDF