Friday, 4 September 2026
  • Home  
  • ఇళ్లపల్లిలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన
- తూర్పు గోదావరి

ఇళ్లపల్లిలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన

సౌర విద్యుత్‌తో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గుతుంది: నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఇళ్లపల్లి, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యకిరణాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని చెప్పారు. సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకునేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి, మండల నాయకులు, ఇళ్లపల్లి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సౌర విద్యుత్‌తో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గుతుంది: నల్లమిల్లి మనోజ్‌రెడ్డి

ఇళ్లపల్లి, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యకిరణాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని చెప్పారు. సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకునేలా కృషి చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి, మండల నాయకులు, ఇళ్లపల్లి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.