కొండపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
వేడుకల్లో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, జనసేన నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు గాంధీ గారు.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొండపల్లిలో ఘనంగా జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు గాంధీ గారు పాల్గొన్నారు.
అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కేకును కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు గాంధీ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




