ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ గుంజేడు ముసలమ్మ ఆటో యూనియన్ చెందిన ఓనర్ & డ్రైవర్ ఆకారపు వెంకన్న అనారోగ్యంతో గత పది రోజుల క్రితం మరణించిన విషయం విధితమే. కాగా ఆటో యూనియన్ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జక్క రంజిత్, కార్యదర్శి నేరటి సుధాకర్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు యూనియన్ తరపున రూ.15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.



