అంబేద్కర్ కోనసీమ జిల్లా | కాట్రేనికోన మండలం
కుండలేశ్వరం వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం కరక్కాయపేటకు చెందిన నాగవరపు సుధీర్ (24) వద్ద సుమారు 1.5 కిలోల (1500 గ్రాములు) గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, ఇన్చార్జ్ ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
విచారణలో సుధీర్ 2 కిలోల గంజాయిని రూ.4 వేలుకు కొనుగోలు చేసి, కొంత భాగాన్ని విక్రయించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా.. అతని వద్ద ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైన పల్సర్ బైక్‌ను కూడా పోలీసులు రికవరీ చేశారు.
సుధీర్‌పై ఇప్పటికే ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Uploaded Video:

