Saturday, 23 May 2026
  • Home  
  • గోపాలపట్నంలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల తాళాలు అందజేసిన ప్రజాప్రతినిధులు
- విశాఖపట్నం

గోపాలపట్నంలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల తాళాలు అందజేసిన ప్రజాప్రతినిధులు

గోపాలపట్నం (జీవీఎంసీ 92వ వార్డు, పద్మనాభనగర్) లో సుమారు 71.52 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఎంపీ ఎం. శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే పి. గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రంగుల రాజకీయాల కోసం 2 వేల కోట్ల ప్రజాధనం వృథా చేసిందని, అదే డబ్బును టిడ్కో ఇళ్లకు కేటాయించి ఉంటే లక్షలాది మంది పేదలకు ఎప్పుడో సొంత ఇళ్లు వచ్చేవని విమర్శించారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ అలసత్వం వల్ల పశ్చిమ నియోజకవర్గంలో 122 మంది, పద్మనాభనగర్‌లోనే 22 మంది లబ్ధిదారులు ఇళ్లు చూడకుండానే మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం వారు సమీపంలోని కాపు సామాజిక భవనాన్ని కూడా ప్రారంభించారు.

గోపాలపట్నం (జీవీఎంసీ 92వ వార్డు, పద్మనాభనగర్) లో సుమారు 71.52 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఎంపీ ఎం. శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే పి. గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రంగుల రాజకీయాల కోసం 2 వేల కోట్ల ప్రజాధనం వృథా చేసిందని,
అదే డబ్బును టిడ్కో ఇళ్లకు కేటాయించి ఉంటే లక్షలాది మంది పేదలకు ఎప్పుడో సొంత ఇళ్లు వచ్చేవని విమర్శించారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ అలసత్వం వల్ల పశ్చిమ నియోజకవర్గంలో 122 మంది, పద్మనాభనగర్‌లోనే 22 మంది లబ్ధిదారులు ఇళ్లు చూడకుండానే మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం వారు సమీపంలోని కాపు సామాజిక భవనాన్ని కూడా ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.