భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 18/08/2026
కొత్తగూడెం.కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
*పథకాలను మరుగున పడేసేందుకు ప్రభుత్వం పథకం
*హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర!
*తులం బంగారం కాదు ఉన్న పథకాన్ని ఊడదీసే ప్లాన్
*లబ్దిదారులకు వెంటనే చెక్కులు విడుదల చేయాలి
*మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి
*కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా
తెలంగాణలోని పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక ఆసరాగా నిలిచే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పోరుబాటకు శ్రీకారం చుట్టింది. పథకాలను ఉద్దేశపూర్వకంగానే మరుగున పడేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
Uploaded Video:


