కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి )::
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా వేగంగా పయనిస్తోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

(దడ పుట్టిస్తున్న వాయుగుండం )
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి ):: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా వేగంగా పయనిస్తోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

