Tuesday, 18 August 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
- రంగారెడ్డి

ఇబ్రహీంపట్నంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఇబ్రహీంపట్నంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఇబ్రహీంపట్నం: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొని పాపన్న గౌడ్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈసీ శేఖర్ మామ, కొత్తకూర్మ శివకుమార్, తాళ్ల శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వర్కల బాలరాజు, బోయ్యపల్లి సుధాకర్‌తో పాటు వర్కల ముత్యాలు, పల్లె సత్యనారాయణ, గరిగే నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పాపన్న గౌడ్ సాగించిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలి! గీత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి! జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!

ఇబ్రహీంపట్నంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఇబ్రహీంపట్నం: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొని పాపన్న గౌడ్‌కు నివాళులర్పించారు.

కార్యక్రమంలో ఈసీ శేఖర్ మామ, కొత్తకూర్మ శివకుమార్, తాళ్ల శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వర్కల బాలరాజు, బోయ్యపల్లి సుధాకర్‌తో పాటు వర్కల ముత్యాలు, పల్లె సత్యనారాయణ, గరిగే నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పాపన్న గౌడ్ సాగించిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

పాపన్న గౌడ్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలి!
గీత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!
జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.