పాపన్న పోరాట స్ఫూర్తిని చాటుకుందాం..
అనాజ్‌పూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
అనాజ్‌పూర్: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు అనాజ్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ తాటిపల్లి విష్ణు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగిస్తూ ప్రజల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అనాజ్‌పూర్ గ్రామ గౌడ సంఘం పెద్దలు, గ్రామ పెద్దలు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





