Search..
logo
పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి : రాఖీ పౌర్ణమి వేడుకలను యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడూ.. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్ విజయకృష్ణన్ అందిస్తున్న సేవలు, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


