వార్త ముఖ్యాంశాలు
- పుల్లంపేట: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్ఐ వి.చిన్నరెడ్డప్ప సూచించారు.
- ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
- మండపాలు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేయాలని, రాత్రి 10 తర్వాత అధిక శబ్దంతో కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు.
పుల్లంపేట: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్ఐ వి.చిన్నరెడ్డప్ప సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మండపాలు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేయాలని, రాత్రి 10 తర్వాత అధిక శబ్దంతో కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. డీజేలు, రాజకీయ ప్రచారం, జూదం, మద్యం, బలవంతపు విరాళాలు నిషేధమన్నారు. పోలీసుల సూచించిన మార్గాల్లోనే ఊరేగింపు, నిమజ్జనం నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.