మంథని, ఆగస్టు 29: సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరుల పాత్ర కీలకమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. శనివారం మంథనిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన విలేకరులు బూడిద రాజు, కొయ్యల రాజమల్లు, తగరం రాజులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా విలేకరులు పని చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.విలేకరులు సమాజానికి అద్దంలా వ్యవహరిస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నారని తెలిపారు. మాదిగ జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో చినగారి శ్రీనివాస్ మాదిగ, కన్నూరి ధర్మేంద్ర మాదిగ, కన్నూరు ఓదెలు మాదిగ, వేల్పుల రాజు మాదిగ, అక్కపాక సంపత్ మాదిగ, కాజీపేట సాగర్ మాదిగ, ఇరుగురాల ప్రసాద్ మాదిగ, తోకల మల్లేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.