నంద్యాల : గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరమణ అనే వ్యక్తి అవమానం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజకీయ విభేదాలు, కొంతమంది చేసిన అవమానకర వ్యాఖ్యల వల్లే మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆత్మహత్యకు ముందు వెంకటరమణ ఒక సూసైడ్ నోట్తో పాటు వాయిస్ రికార్డు కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. తన చనిపోవడానికి కొందరు వ్యక్తులే కారణమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోస్పాడు పోలీసులు, ఆ సూసైడ్ నోట్ మరియు వాయిస్ రికార్డు ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

అవమానం తాళలేక వ్యక్తి ఆత్మహత్య: జిల్లెలలో విషాదం