Sunday, 27 September 2026

Tag: Crime

నంద్యాల

నిరసనలకు ఉద్యోగులు దూరంగా ఉండాలి: నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల: విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించతలపెట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ఆందోళనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని, ఉద్యోగులందరూ విధులకు హాజరవుతూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

నంద్యాల

పొదల్లో పసికందు.. ఆదుకున్న మానవత్వం! రక్షించిన వ్యక్తికి ఏఎస్పీ సత్కారం

నంద్యాల: అయ్యలూరుమెట్ట సమీపంలో కనిపించకుండా పోయిన నెల రోజుల పసికందును చెట్ల పొదల్లో గుర్తించి కాపాడిన వ్యక్తి సమయస్ఫూర్తిని నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ సుస్మిత అభినందించారు. ఈ మేరకు ఆ వ్యక్తిని సత్కరించి ప్రోత్సాహక బహుమతి అందించారు. సెప్టెంబర్‌ 5న పసికందుతో సహా తల్లి అదృశ్యమవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దారిపక్కన పొదల్లో ఉన్న శిశువును సదరు వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆ పసికందును తండ్రికి సురక్షితంగా అప్పగించారు. పసికందు అక్కడికి ఎలా చేరిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

కాకినాడ

ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టిన కాకినాడ జిల్లా, పెద్దాపురం పోలీసులు నిందితుడు అరెస్ట్

ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టిన కాకినాడ జిల్లా, పెద్దాపురం పోలీసులు – నిందితుడు అరెస్ట్, సుమారు రూ. 30 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం పెద్దాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ : 194/2026 u/s 331(4), 305(a) BNS ప్రాపర్టీ లాస్:- 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి మరియు రూ.75,000/- ప్రాపర్టీ రికవరీ:- రూ.15,00,000/- నగదు మరియు బంగారు వస్తువులు మొత్తం 105.4 గ్రాములు ముద్దాయి వివరాలు :- మామిడి శివకుమార్ @ శివ, S/o సూరిబాబు, వయస్సు 30 సంవత్సరాలు, కులం కొండరెడ్డి, కొత్తపాలెం గ్రామం, అడ్డతీగల మండలం. కేసు వివరాలు: తేదీ 25.07.2026 అర్ధరాత్రి సమయంలో పెద్దాపురం, రామారావుపేట, డి.ఎల్.పి.ఓ. కార్యాలయం ఎదురుగా ఉన్న పెద్దాపురం ఆర్.డి.ఓ. గారి నివాసంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటి వెనుక భాగంలోని తలుపుకు కేవలం మెస్ డోర్ మాత్రమే వేసి ఉండటాన్ని గమనించి, తలుపు గడియను తెరిచి ఇంటిలోకి ప్రవేశించాడు. అనంతరం ఎవరూ లేని రెండవ గదిలోని కప్‌బోర్డ్‌లో ఉన్న తాళాన్ని తీసుకొని, దాని సహాయంతో ఇనుప అల్మారాను తెరిచి, అందులోని బంగారం భద్రపరిచే లాకర్‌లో ఉన్న సుమారు 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి మరియు రూ.75,000/- నగదును అపహరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నం.194/2026, సెక్షన్లు 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న పెద్దాపురం SDPO శ్రీ ABG తిలక్ గారిని, ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన పెద్దాపురం CI శ్రీ YRK శ్రీనివాస్, పెద్దాపురం CCS CI శ్రీ అంకబాబు, IT కోర్ CI దుర్గా శేఖర్ రెడ్డి,పెద్దాపురం SI U. పాపారావు, పెద్దాపురం PS సిబ్బంది V.శేషరావు, CCS సిబ్బంది బలరాముర్తి, శ్రీహరి, మూర్తి, నాగరాజు, రమణ, S.బాలాజీ, A.మురళి లను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS గారు అభినందించారు

నంద్యాల

నంద్యాలలో పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది

విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని నంద్యాల జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేని ఇలాంటి నిరసన ప్రదర్శనలకు ఎవరూ వెళ్లకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ, వార్డు సిబ్బంది అనుమతి లేకుండా ధర్నాల్లో పాల్గొంటే అది ‘గవర్నమెంట్ సర్వెంట్ రూల్ ఆఫ్ కండక్ట్’ నిబంధనల ఉల్లంఘన క్రిందికి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకపోయినా విజయవాడకు వెళ్లే వారిని డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా గురిచేసి గుర్తిస్తామని… వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు డిపార్ట్‌మెంట్ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

నంద్యాల

మహిళలు ధైర్యంగా నేరాలను ప్రశ్నించాలి: నంద్యాల డిఎస్పీ సుస్మిత పిలుపు

మహిళలు ధైర్యంగా నిలబడి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని నంద్యాల DSP సుస్మిత సూచించారు. బుక్కాపురం గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ… అక్రమాలు, నేరాలపై మౌనం వహించకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టి బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపిన ఆమె, సైబర్ నేరాలు, నూతన చట్టాలు మరియు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాల జిల్లాలో 27 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన మద్యం పాలసీ 2026-27లో భాగంగా నంద్యాల జిల్లాలో 27 మద్యం దుకాణాలకు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 26 జనరల్ కేటగిరీ, ఒక గీత కార్మికుల రిజర్వుడు దుకాణం ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 5న నంద్యాల కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.ప్రతి దరఖాస్తుకు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు రూ.3 లక్షల నాన్‌-రిఫండబుల్ డీడీ లేదా ఆన్‌లైన్ చలానా చెల్లించాలి. లైసెన్స్ ఫీజును నాలుగు సమాన విడతల్లో, పర్మిట్ రూమ్ ఫీజును మూడు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. దుకాణాల ఏర్పాటులో విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, హైవేలకు సంబంధించి నిర్దేశించిన దూర నిబంధనలు పాటించాలని ఎక్సైజ్ శాఖ సూచించింది.

నంద్యాల

నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, యాక్సిడెంట్ కేసుల పురోగతిని పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ప్రజల భద్రత, సురక్షితమైన ప్రయాణం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

నంద్యాల

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: నంద్యాల జిల్లా ఎస్పీ

నంద్యాల: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్‌లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియలో ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు, రూ.50 వేల జరిమానా

నంద్యాల: సంజామల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 12 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు బోయ బాలకృష్ణకు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.2023 మార్చి 12న నమోదైన ఈ కేసులో అప్పటి ఎస్‌ఐ ఎం.ప్రతాప్‌ పకడ్బందీగా ఆధారాలు సేకరించి చార్జిషీట్‌ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్‌ షొరాణ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తి కాగా, నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. కేసులో పక్కాగా ఆధారాలు సమర్పించి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

నంద్యాల

వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆత్మకూరు: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్‌లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, పోలీస్ బందోబస్తుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.