ఆత్మకూరు: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, పోలీస్ బందోబస్తుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జన ఘాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ