పున్నమి ప్రతినిధి
ముథోల్, సెప్టెంబర్ 16
ముథోల్ మండలం చించాల గ్రామానికి చెందిన సాహితీవేత్త,కవి,రచయిత, జర్నలిస్ట్ పీసర శ్రీనివాస్ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన అష్టావధాన బంధువు పురస్కారం లభించింది. శ్రీ హంసవాహిని సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో వాట్సాప్ వేదికగా నిర్వహించిన లఘు అష్టావధానంలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం ముధోల్ మండల కేంద్రం లో ఆయనను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కిషన్ పతంగి ,మాజీ ఎంపిటిసి రావుల గంగారెడ్డి , మండల ఉపాధ్యక్షులు అజీజ్, ,పి నగేష్, , వి, రాజు, ఆయాజ్ తదితరులు ఉన్నారు



