Tuesday, 29 September 2026

Tag: Crime

నంద్యాల

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన: 98 ఫిర్యాదుల స్వీకరణ

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల నుంచి మొత్తం 98 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై నిర్దిష్ట గడువులోగా విచారణ చేపట్టి పరిష్కరించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని ఎస్పీ ఆదేశించారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిష్కరించిన కేసుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు

నంద్యాల

నీట్ PG పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల: జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ PG 2026 పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS తెలిపారు. AVR SVR, RGM, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు రామకృష్ణ PG కాలేజ్ కేంద్రాల్లో మొత్తం 770 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎస్పీ స్వయంగా కేంద్రాలను సందర్శించి భద్రతను పరిశీలించారు. ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఏఐ గ్లాసెస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కఠినంగా నిషేధించామని, కేంద్రాల వద్ద జామర్లు, సీసీ కెమెరాలు, డ్రోన్ పెట్రోలింగ్‌తో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

నంద్యాల

జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్: అక్రమ మద్యం సీజ్

నంద్యాల: శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలతో నందికొట్కూరు, కొత్తపల్లి, మిడ్తూరు, కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. తనిఖీల్లో నాటుసారాయి, బెల్లం ఊటతో పాటు పలు అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.అనంతరం గ్రామీణులతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, మహిళల భద్రతకు శక్తి యాప్, డయల్ 112 వినియోగించుకోవాలని సూచించారు.

నంద్యాల

రౌడీషీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి: నంద్యాల పోలీస్ హెచ్చరిక

నంద్యాల: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవనోపాధి, ప్రవర్తనపై ఆరా తీశారు.చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

నంద్యాల

అమరుల కుటుంబాలకు అండగా ఎస్పీ

నంద్యాల :విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలు, పదవీ విరమణ చేసిన అధికారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్‌ షొరాణ్‌ తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అమరుల కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షన్‌, ఇతర ఆర్థిక ప్రయోజనాల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సకాలంలో ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో సేవలందించిన రిటైర్డ్‌ అధికారులు, అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ చిన్నికృష్ణ, జిల్లా పరిపాలనాధికారులు, పోలీసు అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల

పెసరవాయిలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

నంద్యాల :పాణ్యం సర్కిల్ గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన పెసరవాయిలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్షన్ పోలీస్ పికెట్‌ను సందర్శించి శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.పికెట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎస్పీతో పాటు పాణ్యం ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

నంద్యాల

రాత్రివేళ బైక్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

నంద్యాల :జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అదుపే లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ గురువారం రాత్రి పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. స్వయంగా మోటార్‌సైకిల్‌పై తిరుగుతూ రాత్రి గస్తీని పర్యవేక్షించారు.శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, విక్టోరియా రీడింగ్ రూమ్, హరిజనపేట పెద్దబండ తదితర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ, నిబంధనలు ఉల్లంఘించే షాపులు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని, రాత్రివేళ అనవసరంగా తిరిగే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

30.276 కేజీల గంజాయి ధ్వంసం

నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్‌, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్‌. ఖాదర్‌ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య

కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ (30) అతని స్నేహాతులు దాడి..కర్రతో పీకలో పొడిచి హత్య అక్రమ సంబంధం మరియు ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణం లో.. టూ టౌన్ పోలీసులు విచారణ

నంద్యాల

బహిరంగ మద్యపానం: ముగ్గురికి ఏడు రోజుల జైలు శిక్ష

నంద్యాల:బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు నంద్యాల జేఎస్‌సీఎం (JSCM) కోర్టు ఏడు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.నంద్యాల మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 24న రామకృష్ణ, విజయ్‌లతో పాటు మరొక వ్యక్తి బహిరంగంగా మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి విచారణ అనంతరం ముగ్గురికీ ఏడు రోజుల జైలు శిక్ష ఖరారు చేశారు.ఈ సందర్భంగా మూడో పట్టణ ఎస్సై జి. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.