– 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్ట్
– 32.350 గ్రాముల బంగారం స్వాధీనం
రైల్వేకోడూరు: పట్టణంలోని వినాయకనగర్‌లో వృద్ధురాలు రాజుపాలెం మంగమ్మ (70) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో జైనాబీ, ఆమె కుమారుడు ఇస్మాక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాల కోసం మంగమ్మను ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32.350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.


