ఎల్ఐసి చట్టాన్ని సవరించి అనుబంధ సంస్థల ద్వారా ఎల్ఐసీ షేర్లను తిరిగి కొనుగోలు చేసి సంస్థ ఉనికిని కాపాడాలని, భవిష్యత్తులో ఎల్ఐసీ షేర్లను విక్రయించే ప్రయత్నం చేయరాదని ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు.కాకినాడ మెయిన్ రోడ్ లో గల ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో ఎల్ఐసిఏఓఐ ఆధ్వర్యంలో గురువారం ఏజెంట్ల డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎల్ఐసీకి ఏజెంట్లే పట్టుకొమ్మలని, వారికి సంక్షేమ నిధిని, పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. బీమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నాశనం చేస్తున్న బీమా సుగమ్ ఎక్సేంజ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎల్ఐసిలో పోర్టుబిలిటీ మరియు ఏజెంట్ పోర్టబిలిటీ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
క్లబ్ మెంబర్‌షిప్‌తో పని లేకుండా అందరికీ బీమా క్లెయిమ్‌లు వర్తింపజేయాలని, ఏజెంట్ల ప్రీమియం పాయింట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే ఏజెంట్ల మొదటి ఏడాది కమీషన్‌ను పునరుద్ధరించాలని, డైరెక్టు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఏజెంట్లంతా 13 డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు.

ఎల్ఐసీ ఏజెంట్ల సంక్షేమ నిధి, పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి
ఎల్ఐసి చట్టాన్ని సవరించి అనుబంధ సంస్థల ద్వారా ఎల్ఐసీ షేర్లను తిరిగి కొనుగోలు చేసి సంస్థ ఉనికిని కాపాడాలని, భవిష్యత్తులో ఎల్ఐసీ షేర్లను విక్రయించే ప్రయత్నం చేయరాదని ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు.కాకినాడ మెయిన్ రోడ్ లో గల ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో ఎల్ఐసిఏఓఐ ఆధ్వర్యంలో గురువారం ఏజెంట్ల డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎల్ఐసీకి ఏజెంట్లే పట్టుకొమ్మలని, వారికి సంక్షేమ నిధిని, పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. బీమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నాశనం చేస్తున్న బీమా సుగమ్ ఎక్సేంజ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎల్ఐసిలో పోర్టుబిలిటీ మరియు ఏజెంట్ పోర్టబిలిటీ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. క్లబ్ మెంబర్‌షిప్‌తో పని లేకుండా అందరికీ బీమా క్లెయిమ్‌లు వర్తింపజేయాలని, ఏజెంట్ల ప్రీమియం పాయింట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే ఏజెంట్ల మొదటి ఏడాది కమీషన్‌ను పునరుద్ధరించాలని, డైరెక్టు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఏజెంట్లంతా 13 డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు.

