కాకినాడ
**పత్రికా ప్రకటన** తేది: 24.08.2026 జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన హత్య కేసులో నిందితుడు, ఫేక్ సైబర్ ఖాన్ అరెస్ట్. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన హత్య కేసులో నిందితుడు ఫేక్ సైబర్ ఖాన్‌ను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కాకినాడ ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిశోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో 06 ప్రత్యేక దర్యాప్తు బృందాలను (SIT) ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం ఉత్తరవైపునలోని మీర్ట్ చేరుకుని, స్థానిక పోలీసుల సహకారంతో 22.08.2026 ఉదయం 09.00 గంటలకు నెరేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ సైబర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం నిందితుడిని మీర్ట్‌లోని గౌరవ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచి, ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని, కాకినాడ తీసుకుని వచ్చి కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తున్నారు. కేసుకు సంబంధించిన మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, CCTV ఫుటేజ్, కార్ డేటా, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు తదితర ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తూ సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు అయిన జగదేవ్‌పేట సీఐ బి. తిరుపతి రావు, తుని టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. గీతారామయ్య, పోర్ట్ ఇన్‌స్పెక్టర్ పి. సునీల్ కుమార్, కాకినాడ సీఐ పీ.పీ. శ్రీనాథ్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ డి. దుర్గాశేర్ రెడ్డి, ఇందుపాలెం ఎస్సై ఎం. వీరబాబు, సర్వవరం ఎస్సై ఎం. యేసుబాబు, ఊపాడు కొత్తపల్లి ఎస్సై జి. వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై టి. తులసిరామ్, తుని టౌన్ ఎస్సై జె. విజయబాబు మరియు సిబ్బందిని వారిని పర్యవేక్షించిన కాకినాడ ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిశోర్ కుమార్ గారిని మరియు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ కివి సత్యనారాయణ గారిని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు రివార్డులతో అభినందించారు.