నంద్యాల :జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అదుపే లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ గురువారం రాత్రి పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. స్వయంగా మోటార్‌సైకిల్‌పై తిరుగుతూ రాత్రి గస్తీని పర్యవేక్షించారు.శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, విక్టోరియా రీడింగ్ రూమ్, హరిజనపేట పెద్దబండ తదితర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ, నిబంధనలు ఉల్లంఘించే షాపులు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని, రాత్రివేళ అనవసరంగా తిరిగే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రాత్రివేళ బైక్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు