నంద్యాల :పాణ్యం సర్కిల్ గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన పెసరవాయిలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్షన్ పోలీస్ పికెట్‌ను సందర్శించి శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.పికెట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎస్పీతో పాటు పాణ్యం ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

పెసరవాయిలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ