అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం: రాష్ట్రంలో కొత్తగా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం మలికిపురం మండలం లక్కవరంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది వృద్ధులు, వితంతువులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
అర్హులైన వారందరినీ గుర్తించి సెప్టెంబర్లో జాబితా సిద్ధం చేయాలని, అక్టోబర్ 2 నుంచి నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా పెన్షన్ మంజూరు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని రుద్రరాజు గోపాలకృష్ణరాజు డిమాండ్ చేశారు.
Uploaded Video:

