Monday, 28 September 2026

Tag: Crime

నంద్యాల

వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆత్మకూరు: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్‌లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, పోలీస్ బందోబస్తుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

జూద శిబిరంపై దాడి: 8 మంది అరెస్ట్, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం

జూపాడుబంగ్లా: మండ్లెం గ్రామ శివారులోని పొలాల్లో అందర్-బహార్ జూదం ఆడుతున్న స్థావరంపై జూపాడుబంగ్లా ఎస్‌ఐ K. మల్లికార్జున సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.1,25,630 నగదు, 52 పేకముక్కలు, 7 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుండి మరో ఐదుగురు పరారయ్యారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి

లారీ కింద పడి డ్రైవర్ దుర్మరణం

– ప్రమాదాన్ని తప్పించుకునేందుకు దూకిన డ్రైవర్‌పైకే ఎక్కిన లారీ – చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో విషాద ఘటన కడప–చెన్నై ప్రధాన రహదారిపై ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ కింద పడే ప్రమాదం ఉందని భావించిన డ్రైవర్ బి. మురళి వాహనం నుంచి రోడ్డుపైకి దూకారు. అయితే, దురదృష్టవశాత్తు అదే లారీ ఆయనపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాడిపత్రి గ్రామానికి చెందిన బి. మురళిగా ఎస్‌ఐ సుజన్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

తిరుపతి

కోడూరు: వినాయక వేడుకలపై పోలీసుల కీలక సూచనలు

-మండపాల వద్ద 24 గంటల పర్యవేక్షణ తప్పనిసరి -ఆన్‌లైన్‌లో ముందస్తు అనుమతులు పొందాలని సూచన -నిమజ్జనం వరకు నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ రైల్వే కోడూరు: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండపం ఏర్పాటు నుంచి విగ్రహ నిమజ్జనం వరకు కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటల పాటు పర్యవేక్షణ ఉండేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. పోలీస్, పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి ఆన్‌లైన్ ద్వారా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠ, నిమజ్జనం తేదీల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని కోరారు.

తిరుపతి

పుల్లంపేటలో డ్రోన్ నిఘా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

• వత్తలూరు, పెద్దూరు, తిప్పాయపల్లిలో విస్తృతంగా పర్యవేక్షణ • పేకాట, కోళ్ల పందేలు, గంజాయి స్థావరాలపై ప్రత్యేక దృష్టి • అనుమానాస్పద కదలికలపై తక్షణ చర్యలకు పోలీసుల సిద్ధం పుల్లంపేట: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్‌ఐ వి. చిన్నరెడ్డెప్ప ఆధ్వర్యంలో వత్తలూరు, పెద్దూరు, తిప్పాయపల్లి గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేపట్టారు. గ్రామాలు, శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రోన్ ద్వారా గుర్తించే అనుమానాస్పద కదలికలపై స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

తిరుపతి

బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య

– 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్ట్ – 32.350 గ్రాముల బంగారం స్వాధీనం రైల్వేకోడూరు: పట్టణంలోని వినాయకనగర్‌లో వృద్ధురాలు రాజుపాలెం మంగమ్మ (70) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో జైనాబీ, ఆమె కుమారుడు ఇస్మాక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాల కోసం మంగమ్మను ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32.350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.

నంద్యాల

ఆన్‌లైన్ వాహన కొనుగోలు వివాదం పరిష్కారం: బాధితుడికి అప్పగించిన బైక్

సంజామల: ఆన్‌లైన్ ద్విచక్ర వాహన కొనుగోలు వ్యవహారంలో పోలీసులు సత్వరంగా స్పందించి బాధితుడికి న్యాయం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యం పాండే, ఆల్వకొండకు చెందిన గిరి హుస్సేన్‌తో రూ.40 వేలకు బైక్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, ముందస్తుగా రూ.30 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.10 వేలకు బదులుగా హుస్సేన్ అదనంగా రూ.20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సంజామల ఎస్‌ఐ రమణయ్య, కోయిలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెంటనే స్పందించి, భాషా సమస్యను అధిగమిస్తూ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పూర్వ ఒప్పందం ప్రకారమే మిగిలిన రూ.10 వేలు చెల్లించేలా చూసి, సత్యం పాండేకు వాహనాన్ని అప్పగించారు. సత్వర న్యాయం అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

నంద్యాల

కారు ప్రమాదంలో మృతిచెందిన ASI కుటుంబానికి ₹20.80 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

నంద్యాల : కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ASI) G. సురేష్ రెడ్డి కుటుంబానికి శాఖ పరంగా మంజూరైన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS గురువారం అందజేశారు.ఈ సందర్భంగా మృతుని భార్యకు ₹20,80,000/- విలువైన చెక్కును స్వయంగా అందజేసిన ఎస్పీ, పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ S. ఖాదర్ భాషా, పాలనా విభాగ అధికారులు వీరన్న, కవిత, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయక్ పాల్గొన్నారు.

నంద్యాల

అవమానం తాళలేక వ్యక్తి ఆత్మహత్య: జిల్లెలలో విషాదం

నంద్యాల : గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరమణ అనే వ్యక్తి అవమానం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజకీయ విభేదాలు, కొంతమంది చేసిన అవమానకర వ్యాఖ్యల వల్లే మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆత్మహత్యకు ముందు వెంకటరమణ ఒక సూసైడ్ నోట్‌తో పాటు వాయిస్ రికార్డు కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. తన చనిపోవడానికి కొందరు వ్యక్తులే కారణమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోస్పాడు పోలీసులు, ఆ సూసైడ్ నోట్ మరియు వాయిస్ రికార్డు ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

నంద్యాల

చోరీని 8 గంటల్లోనే ఛేదించిన వన్‌టౌన్ సీఐ: ఆర్యవైశ్యుల ఘన సన్మానం

నంద్యాల పట్టణంలోని శేషసాయి బృందావన్ అపార్టుమెంట్‌లో చోటుచేసుకున్న చోరీ కేసును వన్‌టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి బృందం కేవలం 8 గంటల్లోనే ఛేదించింది. బాధితుడు వంకదార రాము స్కూటర్ పార్క్ చేస్తుండగా, గోడ దూకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన చేతిలోని బ్యాగును లాక్కొని పారిపోయాడు.బాధితుడి సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన సీఐ సుధాకర్ రెడ్డి, కేవలం ఎనిమిది గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి పోయిన నగదును రికవరీ చేశారు. పోలీసుల వేగవంతమైన స్పందన, అంకితభావానికి ప్రశంసగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సీఐ సుధాకర్ రెడ్డిని, వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.