Monday, 28 September 2026
  • Home  
  • నంద్యాలలో బీరు సీసాలతో దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్!
- నంద్యాల

నంద్యాలలో బీరు సీసాలతో దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

నంద్యాలలో బీరు సీసాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 8వ తేదీ రాత్రి నంద్యాల పట్టణంలోని త్రివేణి బార్ వద్ద జరిగిన గొడవలో ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేసి ఓ వ్యక్తికి గాయాలు చేసినట్లు కేసు నమోదైంది.ఈ ఘటనపై నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.79/2026, U/Sec 109(1) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో షేక్ ఇమ్రాన్ బాషా అలియాస్ ఇమ్రాన్, వయస్సు 33 సంవత్సరాలు, అలాగే గుజ్జే ఈశ్వర్ రావు అలియాస్ గుడ్డి ఈశ్వర్, వయస్సు 44 సంవత్సరాలు ఉన్నారు.కేసులో భాగంగా ఇద్దరు నిందితులను సెప్టెంబర్ 27న నంద్యాల పట్టణంలోని పాటిమా నగర్‌లోని ఓపెన్ ప్లాట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నంద్యాల వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. సుధాకర్ రెడ్డి తెలిపారు.నంద్యాల జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.