Sunday, 2 August 2026
  • Home  
  • కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.. ఘనంగా కెకెసి ఆవిర్భావ వేడుకలు
- ఖమ్మం

కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.. ఘనంగా కెకెసి ఆవిర్భావ వేడుకలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్) అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కెకెసి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విప్లవ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షుడు జంగిపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్మికులు సంఘటితమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌లో చేరిన కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్, ఉమ్మినేని కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్, కెకెసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)

అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కెకెసి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విప్లవ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షుడు జంగిపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్మికులు సంఘటితమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌లో చేరిన కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్, ఉమ్మినేని కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్, కెకెసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.