రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
క్వారీ మార్కెట్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండా స్తూపం వద్ద బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



