Wednesday, 22 July 2026
  • Home  
  • ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి కట్ల సంతోష్*
- ఖమ్మం

ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి కట్ల సంతోష్*

*ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి కట్ల సంతోష్* BLO, BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ వైరా : మున్సిపాలిటీ పరిధిలోని 198, 213 పోలింగ్ బూత్‌ల బూత్ లెవెల్ అధికారులు (BLO), బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA)తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో కొనసాగుతున్న SIR కార్యక్రమం (ఓటర్ల ప్రత్యేక పరిశీలన కార్యక్రమం) పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు అయ్యాయి, ఇంకా ఎన్ని దరఖాస్తులు నమోదు చేయాల్సి ఉంది, ఓటర్ల షిఫ్టింగ్‌కు సంబంధించిన వివరాలు, పెండింగ్ అంశాలపై BLOలు, BLAలతో చర్చించారు. కార్యక్రమం వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కట్ల సంతోష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలాంటి కారణాలతోనూ అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో BLOలు ఫాతిమా, నాగూర్‌తో పాటు నాయకులు, ప్రతినిధులు నరేష్, మదుపల్లి కృష్ణ, నాగుల్ పాషా, వెంకట కృష్ణ, కొక్కిరేణి లింగయ్య, మహేష్, మంచికంటి అప్పారావు, బొల్లాపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి కట్ల సంతోష్*

BLO, BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్

వైరా :
మున్సిపాలిటీ పరిధిలోని 198, 213 పోలింగ్ బూత్‌ల బూత్ లెవెల్ అధికారులు (BLO), బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA)తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో కొనసాగుతున్న SIR కార్యక్రమం (ఓటర్ల ప్రత్యేక పరిశీలన కార్యక్రమం) పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు అయ్యాయి, ఇంకా ఎన్ని దరఖాస్తులు నమోదు చేయాల్సి ఉంది, ఓటర్ల షిఫ్టింగ్‌కు సంబంధించిన వివరాలు, పెండింగ్ అంశాలపై BLOలు, BLAలతో చర్చించారు. కార్యక్రమం వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కట్ల సంతోష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలాంటి కారణాలతోనూ అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో BLOలు ఫాతిమా, నాగూర్‌తో పాటు నాయకులు, ప్రతినిధులు నరేష్, మదుపల్లి కృష్ణ, నాగుల్ పాషా, వెంకట కృష్ణ, కొక్కిరేణి లింగయ్య, మహేష్, మంచికంటి అప్పారావు, బొల్లాపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.