ఆగష్టు 26, మానవతా మూర్తి, భారతరత్న మదర్ థెరిస్సా జయంతి. ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు.ఆరిపించిన సామాజిక కార్యకర్త మాతంగి అంబెడ్కర్ మాట్లాడుతూ
ఆగష్టు ఇరవై ఆరున వెలసిన వెలుగువు నీవు,
అల్బేనియా గడ్డపై పుట్టి, భారతికి తల్లివైనావు.
తెల్లని చీరలో నీలపు అంచు కట్టి, కరుణనే వస్త్రంగా కప్పుకున్న మాత మదర్ థెరిస్సా. ఆకలితో అలమటించే అనాథకు అన్నమై, వీధిలో విసిరేయబడిన శిశువుకు అమ్మగా, కుష్టు రోగి గాయానికి కన్నీటి మందుగా, చావు అంచున ఉన్నవారికి చివరి దీపంగా నిలిచిన మహనీయురాలు.అని అన్నారు
ప్రేమకు భాష లేదని చూపించి, సేవే దైవమని నిరూపించిన మహోన్నత వ్యక్తి. “చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి” అని లోకానికి సత్యాన్ని బోధించారు.అని తెలిపినారు
నోబెల్ శాంతి బహుమతి వారి పాదాలను తాకినా, వినయమే వారి కిరీటమై వెలిగింది. కలకత్తా వీధులే దేవాలయంగా, మానవత్వమే మతంగా జీవించి, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.అని అన్నారు
ఓ మదర్ థెరిస్సా! మానవతా మూర్తి! నీ జయంతి నేడు మాకు ప్రేరణ.
నీ చూపిన దారిలో ఒక్క అడుగైనా వేసి, మనిషిగా మనిషిని ప్రేమించడం నేర్చుకుందాం.
ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో ఒక పేదవానికి సహాయం చేయాలని, సేవా భావాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను.


