కానిస్టేబుల్‌కు ప్రమోషన్.. పోలీస్‌స్టేషన్‌లో అభినందనల వెల్లువ…
దొరవారి సత్రం: దొరవారి సత్రం మండల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంకు ప్రమోషన్ …కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన నేపథ్యంలో ఆయనకు ఉన్నత పదవికి ప్రమోషన్ లభించింది.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సుబ్రహ్మణ్యన్ని అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, విధి నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవలందించడం అభినందనీయమని సిబ్బంది పేర్కొన్నారు.
ప్రమోషన్. పొందిన సుబ్రహ్మణ్యానికి పోలీస్ అధికారులు, తోటి సిబ్బందిలు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..



