Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోటమంగాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం🙏 🙏💐సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోటమంగాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం🙏 🙏💐సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

వార్త ముఖ్యాంశాలు

  • *రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్‌పుస్తకాల పంపిణీ*💐 ✍️*కె.వి.బి.పురం, సెప్టెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.
  • గురువారం కె.వి.బి.పురం మండలం కోటమంగాపురం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.*✌️💯 💐🙏ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పల్లె పండుగ–2.0 కార్యక్రమంలో భాగంగా 💐కోటమంగాపురం పంచాయతీలో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు.
  • పంచాయతీ సచివాలయం నుంచి వెటర్నరీ ఆసుపత్రి వరకు, అలాగే జయరాం ఇంటి నుంచి గురుమూర్తి ఇంటి వరకు నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చార.💐 🙏అనంతరం ఉదయం 10.30 గంటలకు కోటమంగాపురం గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్‌పుస్తకాలను…

*రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్‌పుస్తకాల పంపిణీ*💐

✍️*కె.వి.బి.పురం, సెప్టెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. గురువారం కె.వి.బి.పురం మండలం కోటమంగాపురం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.*✌️💯

💐🙏ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పల్లె పండుగ–2.0 కార్యక్రమంలో భాగంగా 💐కోటమంగాపురం పంచాయతీలో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. పంచాయతీ సచివాలయం నుంచి వెటర్నరీ ఆసుపత్రి వరకు, అలాగే జయరాం ఇంటి నుంచి గురుమూర్తి ఇంటి వరకు నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చార.💐

🙏అనంతరం ఉదయం 10.30 గంటలకు కోటమంగాపురం గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా అందజేశారు. పట్టా పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.✌️

✍️🥉గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

✍️ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎమ్మార్వో గారు,సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు,యువత, అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు రామానుజులు నాయుడు గారు, గోపీనాథ్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు,శ్రీహరి గారు డాక్టర్ రమేష్ గారు బాలాజీ గారు చెంగారెడ్డి గారు అవసరం సురేష్ గారు, తలారి అయ్యప్ప గారు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు✍️

Leave a comment

Your email address will not be published. Required fields are marked *