తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 13:
కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు జి.ఎస్. రావు మృతిపట్ల టీడీపీ యువ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్. రాజీవ్ కృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జి.ఎస్. రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్. రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ జి.ఎస్. రావు ప్రజాసేవకు ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, రాజకీయాల్లో పాటించిన విలువలు, నిబద్ధత భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన మరణం కొవ్వూరు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని అన్నారు.
జి.ఎస్. రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజీవ్ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని జి.ఎస్. రావుకు ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


