అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
యలమంచిలి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యలమంచిలి మండలంలోని రుక్మిణీపురం,రేగుపాలెం గ్రామాల్లో. కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి ఉత్సవం (ఉట్టి కొట్టే కార్యక్రమం)తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ధర్మాన్ని పరిరక్షించి, సమాజంలో శాంతియుతమైన జీవనాన్ని అందించడమే శ్రీకృష్ణుడి సందేశం. జగద్గురువు శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


