Saturday, 5 September 2026
  • Home  
  • రెబ్బెనలో గంజాయి జోరు.. పేకాటపై పోలీసుల నిఘా ఏది?
- ASIFABAD

రెబ్బెనలో గంజాయి జోరు.. పేకాటపై పోలీసుల నిఘా ఏది?

బల్లార్షా నుంచి గంజాయి తరలిస్తుండగా ఇద్దరు యువకులు పట్టుబడటంతో కలకలం గ్రామాల్లో పేకాట, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ రెబ్బెన ఎస్సై పనితీరుపై ప్రజల ప్రశ్నలు.. ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని విజ్ఞప్తి రెబ్బెన, సెప్టెంబర్ 5 (పున్నమి రిపోర్టర్): రెబ్బెన మండలంలో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మత్తుపదార్థాల విక్రయాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి గంజాయిని తరలిస్తున్న సమయంలో మండలానికి చెందిన ఇద్దరు గ్రామ యువకులు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బయటి ప్రాంతాల నుంచి గంజాయి తరలింపు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని గ్రామాలు, పల్లెల్లో గంజాయి విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? వాటిపై పోలీసుల నిఘా ఎంతవరకు ఉంది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో మత్తుపదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేకాటను ప్రశ్నించిన యువకుడి విషయంలో వివాదం గతంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు వాట్సాప్ గ్రూప్ వేదికగా కొందరు వార్డు సభ్యులు పేకాట ఆడుతున్నారని ప్రస్తావించి, పేకాటను అరికట్టాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ వార్డు సభ్యుడు ఆ యువకుడిని ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం గ్రామ సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు, సర్పంచ్ భర్త, వార్డు సభ్యుల భర్తలు కలిసి ఆ యువకుడి పై రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే ఘటనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి ఫిర్యాదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఓ వార్డు సభ్యుడి కుమారుడు పేకాట ఆడుతున్న సమయంలో గ్రామ యువకుడి భార్య ఫొటో తీసి అదే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు, అనంతరం ఆ మహిళను కించపరిచే విధంగా మరో పోస్టు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇరువైపుల నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ, తమపై మాత్రమే పోలీసులు చర్యలకు ప్రయత్నించారని, మరోవైపు తమను దూషించిన వార్డు సభ్యుడిపై, మహిళను కించపరిచేలా పోస్టు చేసిన యువకుడిపై తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అలాగే రెబ్బెన ఎస్సై తమను దూషించి, చివరకు కేసును రాజీ చేసుకునే విధంగా వ్యవహరించారని వారు పేర్కొంటున్నారు. “ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు?” ఈ పరిణామాల నేపథ్యంలో రెబ్బెన ఎస్సై ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో పేకాట వంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా, మరోవైపు వాటిని ప్రశ్నించే యువతపై కేసులు, ఒత్తిళ్లు వస్తే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు సభ్యుల స్థాయిలోనే పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉంటే, సామాన్య ప్రజలు, యువత పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేకాట నుంచి మత్తుపదార్థాల వైపు యువత వెళ్లే ప్రమాదం గ్రామాల్లో పేకాట, ఇతర అక్రమ కార్యకలాపాలు పెరిగితే వాటి ప్రభావం యువతపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మత్తుపదార్థాల వైపు మళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, పేకాట, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను కించపరిచే పోస్టులు వంటి ఏ చిన్న అక్రమ కార్యకలాపం జరిగినా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సై పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి అవసరం ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ ఒకవైపు వ్యక్తుల మాటలు మాత్రమే కాకుండా ఇరువర్గాల వాదనలు, ఆధారాలు, వాట్సాప్ పోస్టులు, ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రెబ్బెన పోలీస్ అధికారులు పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు. అలాగే మండలంలో గంజాయి, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. “చట్టం అందరికీ సమానమే.. తప్పు చేసిన వారిపై చర్యలు ఉండాలి.. ప్రశ్నించిన వారిపై ఒత్తిళ్లు ఉండకూడదు” అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

బల్లార్షా నుంచి గంజాయి తరలిస్తుండగా ఇద్దరు యువకులు పట్టుబడటంతో కలకలం
గ్రామాల్లో పేకాట, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
రెబ్బెన ఎస్సై పనితీరుపై ప్రజల ప్రశ్నలు.. ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని విజ్ఞప్తి

రెబ్బెన, సెప్టెంబర్ 5 (పున్నమి రిపోర్టర్):
రెబ్బెన మండలంలో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మత్తుపదార్థాల విక్రయాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి గంజాయిని తరలిస్తున్న సమయంలో మండలానికి చెందిన ఇద్దరు గ్రామ యువకులు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

బయటి ప్రాంతాల నుంచి గంజాయి తరలింపు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని గ్రామాలు, పల్లెల్లో గంజాయి విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? వాటిపై పోలీసుల నిఘా ఎంతవరకు ఉంది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో మత్తుపదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పేకాటను ప్రశ్నించిన యువకుడి విషయంలో వివాదం

గతంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు వాట్సాప్ గ్రూప్ వేదికగా కొందరు వార్డు సభ్యులు పేకాట ఆడుతున్నారని ప్రస్తావించి, పేకాటను అరికట్టాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ వార్డు సభ్యుడు ఆ యువకుడిని ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం గ్రామ సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు, సర్పంచ్ భర్త, వార్డు సభ్యుల భర్తలు కలిసి ఆ యువకుడి పై రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే ఘటనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి ఫిర్యాదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఓ వార్డు సభ్యుడి కుమారుడు పేకాట ఆడుతున్న సమయంలో గ్రామ యువకుడి భార్య ఫొటో తీసి అదే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు, అనంతరం ఆ మహిళను కించపరిచే విధంగా మరో పోస్టు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఇరువైపుల నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ, తమపై మాత్రమే పోలీసులు చర్యలకు ప్రయత్నించారని, మరోవైపు తమను దూషించిన వార్డు సభ్యుడిపై, మహిళను కించపరిచేలా పోస్టు చేసిన యువకుడిపై తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అలాగే రెబ్బెన ఎస్సై తమను దూషించి, చివరకు కేసును రాజీ చేసుకునే విధంగా వ్యవహరించారని వారు పేర్కొంటున్నారు.

“ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు?”

ఈ పరిణామాల నేపథ్యంలో రెబ్బెన ఎస్సై ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో పేకాట వంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా, మరోవైపు వాటిని ప్రశ్నించే యువతపై కేసులు, ఒత్తిళ్లు వస్తే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వార్డు సభ్యుల స్థాయిలోనే పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉంటే, సామాన్య ప్రజలు, యువత పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పేకాట నుంచి మత్తుపదార్థాల వైపు యువత వెళ్లే ప్రమాదం

గ్రామాల్లో పేకాట, ఇతర అక్రమ కార్యకలాపాలు పెరిగితే వాటి ప్రభావం యువతపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మత్తుపదార్థాల వైపు మళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, పేకాట, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను కించపరిచే పోస్టులు వంటి ఏ చిన్న అక్రమ కార్యకలాపం జరిగినా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎస్సై పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి అవసరం

ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ ఒకవైపు వ్యక్తుల మాటలు మాత్రమే కాకుండా ఇరువర్గాల వాదనలు, ఆధారాలు, వాట్సాప్ పోస్టులు, ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రెబ్బెన పోలీస్ అధికారులు పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు. అలాగే మండలంలో గంజాయి, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

“చట్టం అందరికీ సమానమే.. తప్పు చేసిన వారిపై చర్యలు ఉండాలి.. ప్రశ్నించిన వారిపై ఒత్తిళ్లు ఉండకూడదు” అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.