విశాఖపట్నం, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి) :
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. www.ganeshutsav.net ద్వారా ఆన్లైన్లోనే మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదిక ద్వారా అనుమతులు పొందే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఈ-పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.



