ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 23 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లెవీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గ్రామంలో పర్యటించి ఉపాధి హామీ పనులు, తాగునీటి పథకం, సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నెల రోజుల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు.

వెంకటాచలంలో పల్లెవీక్షణ.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 23 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లెవీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గ్రామంలో పర్యటించి ఉపాధి హామీ పనులు, తాగునీటి పథకం, సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నెల రోజుల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు.


1 Comment
viman
July 23, 2026కడప జిల్లా
పులివెందుల
కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను ప్రకాష్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. లీకేజీలకు బాధ్యులెవ్వరైనా శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. నిరసనల పేరుతో మహిళా జర్నలిస్టుపై అసభ్యంగా ప్రవర్తించడం ఖండనీయమని, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను ప్రజలంతా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు వాజ్పాయి, పట్టణ అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.