అరకులోయ, ఆగస్టు 31: మండలంలోని బస్కీ గ్రామంలో క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. బస్కీ పంచాయితీ గ్రామాలకు చెందిన 500 మందికి పైగా ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. డాక్టర్ కిరణ్, క్యాంపు నిర్వాహకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో ఆరుగురు స్పెషలిస్టు వైద్యులు, 15 మంది నర్సులు పాల్గొన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మారుమూల గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు.. 500 మందికి వైద్య సేవలు