Tuesday, 1 September 2026
  • Home  
  • జనగామ డి సి పి రాజా మహేంద్ర నాయక్ ఐపీస్ హోదా సందర్బంగా ఘనంగా సన్మానం
- జనగాం

జనగామ డి సి పి రాజా మహేంద్ర నాయక్ ఐపీస్ హోదా సందర్బంగా ఘనంగా సన్మానం

జనగామ డీసీపీ రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా: ఘనంగా సత్కరించిన నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక ——————————————————————- జనగామ, ఆగస్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెస్ట్‌జోన్‌ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా లభించడం పట్ల స్థానిక సామాజిక, కళా, సాహిత్య సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం డీసీపీ కార్యాలయంలో ఆయనను నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావు, కవులు కళాకారుల ఐక్యవేదిక చైర్మన్ జి.కృష్ణ కలిసి డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఐపీఎస్‌ హోదా‌ లభించడం‌ జనగామ ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు.శాఖపరంగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలతో పాటు, ఇక్కడి కళా, సాహిత్య రంగాలకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నారగోని‌ మూర్తి, టి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

జనగామ డీసీపీ రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా: ఘనంగా సత్కరించిన నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక
——————————————————————-
జనగామ, ఆగస్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెస్ట్‌జోన్‌ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా లభించడం పట్ల స్థానిక సామాజిక, కళా, సాహిత్య సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా సోమవారం డీసీపీ కార్యాలయంలో ఆయనను నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావు, కవులు కళాకారుల ఐక్యవేదిక చైర్మన్ జి.కృష్ణ కలిసి డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఐపీఎస్‌ హోదా‌ లభించడం‌ జనగామ ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు.శాఖపరంగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలతో పాటు, ఇక్కడి కళా, సాహిత్య రంగాలకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నారగోని‌ మూర్తి, టి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.