Tuesday, 1 September 2026
  • Home  
  • GCDO గౌసియా బేగం పై చర్యలు తీసుకోవాలి :పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జిల్లా అధ్యక్షులు
- జనగాం

GCDO గౌసియా బేగం పై చర్యలు తీసుకోవాలి :పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జిల్లా అధ్యక్షులు

గురుకులాల్లో NSPC నమోదుకు టార్గెట్లు పెట్టడం సరికాదు:పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జనగామ జిల్లా అధ్యక్షులు ———————————————————————- GCDO గౌసియా బేగంపై చర్యలు తీసుకోవాలని టీఆర్పీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్న National Student Paryavaran Competition (NSPC) నమోదుకు ఉపాధ్యాయులకు రోజువారీ టార్గెట్లు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా NSPC నమోదులో నెంబర్ వన్‌గా రావాలనే ఉద్దేశంతో GCDO గౌసియా బేగం ఉపాధ్యాయులకు టార్గెట్లు విధిస్తున్నారని తమకు సమాచారం అందిందని, ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని పిట్టల సురేష్ అన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు పాఠాలు బోధించడం, వారి విద్యా ప్రగతిపై దృష్టి పెట్టడం అని, విద్యార్థుల ద్వారా జరగాల్సిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఉపాధ్యాయులపై టార్గెట్ల రూపంలో మోపడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రోజువారీ టార్గెట్ల ఒత్తిడి కారణంగా నమోదులో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, తప్పుడు పేర్లతో లేదా సరైన వివరాలు లేకుండా అప్లికేషన్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని” పిట్టల సురేష్ అన్నారు. ఈ వ్యవహారంపై GCDO గౌసియా బేగంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై MPDO గారికి ఈరోజు వినతి పత్రం అందజేసి, గురుకులాల్లో NSPC నమోదుకు విధిస్తున్న టార్గెట్లు, నమోదుల నాణ్యత, ఉపాధ్యాయులపై పడుతున్న పనిభారం తదితర అంశాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పిట్టల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, జిల్లా కార్యదర్శి వరకుప్పల గంగరాజు, యూత్ సంయుక్త కార్యదర్శి సాయి,యూత్ నాయకులు సాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల్లో NSPC నమోదుకు టార్గెట్లు పెట్టడం సరికాదు:పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జనగామ జిల్లా అధ్యక్షులు
———————————————————————-

GCDO గౌసియా బేగంపై చర్యలు తీసుకోవాలని
టీఆర్పీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్న National Student Paryavaran Competition (NSPC) నమోదుకు ఉపాధ్యాయులకు రోజువారీ టార్గెట్లు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
జనగామ జిల్లా NSPC నమోదులో నెంబర్ వన్‌గా రావాలనే ఉద్దేశంతో GCDO గౌసియా బేగం ఉపాధ్యాయులకు టార్గెట్లు విధిస్తున్నారని తమకు సమాచారం అందిందని, ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని పిట్టల సురేష్ అన్నారు.
ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు పాఠాలు బోధించడం, వారి విద్యా ప్రగతిపై దృష్టి పెట్టడం అని, విద్యార్థుల ద్వారా జరగాల్సిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఉపాధ్యాయులపై టార్గెట్ల రూపంలో మోపడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
రోజువారీ టార్గెట్ల ఒత్తిడి కారణంగా నమోదులో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, తప్పుడు పేర్లతో లేదా సరైన వివరాలు లేకుండా అప్లికేషన్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని” పిట్టల సురేష్ అన్నారు.
ఈ వ్యవహారంపై GCDO గౌసియా బేగంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది.
ఈ విషయంపై MPDO గారికి ఈరోజు వినతి పత్రం అందజేసి, గురుకులాల్లో NSPC నమోదుకు విధిస్తున్న టార్గెట్లు, నమోదుల నాణ్యత, ఉపాధ్యాయులపై పడుతున్న పనిభారం తదితర అంశాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పిట్టల సురేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, జిల్లా కార్యదర్శి వరకుప్పల గంగరాజు, యూత్ సంయుక్త కార్యదర్శి సాయి,యూత్ నాయకులు సాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.