రామవరం, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు కూడా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు భాషను ప్రజల నిత్య వ్యవహారంలోకి తీసుకురావడంతో పాటు, సరళమైన వ్యవహారిక భాషకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



