Friday, 2 October 2026

Tag: సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ ధ్వజం

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆరో రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ఆందోళన చేపట్టారు. గ్రామాలకు కేంద్రం నుంచి అందుతున్న ఆర్థిక నిధులు సిబ్బంది జీతాలు, నిర్వహణకే సరిపోతున్నాయని, కొత్తగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో సిరిసిల్లను దత్తత తీసుకుంటానన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. 1000 రోజుల పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

బిఆర్ఎస్ విమర్శలు ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌: ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లో ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్‌రెడ్డి, పార్లమెంట్‌ కో-కన్వీనర్‌ కనమేని చక్రధర్‌రెడ్డి అన్నారు. ముస్తాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కొండం రాజిరెడ్డి, రంజాన్‌ నరేష్‌, ఆరుట్ల మహేష్‌, మిరుదొడ్డి భాను, యాగండ్ల మల్లేష్‌, ఉచ్చిడి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ T G S W R E I S లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్, సెప్టెంబర్ 5: ముస్తాబాద్‌లోని TGSWREIS పాఠశాలలో శనివారం రోజున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మరియు సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజలింగం వైస్ చైర్మన్ నర్సింలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ఆటల పోటీల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం ఉపాధ్యాయులకు పేరెంట్ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు. తదుపరి ఉపాధ్యాయులు, పేరెంట్ కమిటీ సభ్యుల పరిచయ వేదికను ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి, విద్యాబోధన, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, విద్యార్థుల క్రమశిక్షణ, వివిధ సబ్జెక్టుల బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

వివాహ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: ముస్తాబాద్ రైతు ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు వంగూరి దిలీప్ ( గూడూరు ) వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ముస్తాబాద్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలం.. ముస్తాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ భగ్గుమాటు.. ముస్తాబాద్‌లో వంటావార్పు ముస్తాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై చేపట్టిన నిరసనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు బొంపల్లి సురేందర్‌రావు, జనగామ శరత్‌రావు సంతు పట్ల అంజిరెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి, మెంగని మనోహర్‌ రాచమడుగు సంతోష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

రాజన్న సిరిసిల్ల

ప్యాడి బకాయిలు చెల్లించకుండానే మిషనరీ తరలింపు రైస్ మిల్ సీజ్

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల: ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్యాడీ బకాయిలను చెల్లించకుండానే రైస్ మిల్లులోని మిషనరీని లారీలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్న మహేశ్వరి రైస్ మిల్లును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. మిల్లుపై ప్రభుత్వానికి సుమారు రూ.1.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు డీఎస్ఓ బుచ్చిబాబు తెలిపారు. మిషనరీని తరలిస్తున్న విషయం గురించి మీడియా ప్రతినిధులు డీఎస్ఓకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మహేశ్వరి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ బాకికార్డు నిరసన

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు చేపట్టిన ఏడు రోజుల నిరసనల్లో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి, 420 అడుగుల ఫ్లెక్స్‌ ప్రదర్శనతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, తుల ఉమ, చీటి నర్సింగారావు, జనగామ శరత్‌రావు, చీటి వెంకట నరసింహారావు బొంపల్లి సురేందర్‌రావు, రాసమడుగు సంతోష్ ,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి , కొండ శ్రీనివాస్‌గౌడ్‌, శీలం స్వామి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి, మెంగనీ మనోహర్‌, కౌన్సిలర్లు, ఏదునూరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్‌

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, కొండం రాజిరెడ్డి, వెలుముల రాంరెడ్డి, ఆరుట్ల మహేష్, భానుకుమార్, రంజాని నరేష్, ఎదునూరి భానుచందర్, తలారి నర్సయ్య, కొప్పు రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఇల్లంతకుంట నూతన SIకి దళిత సంఘాల శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) ఇల్లంతకుంట నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్రచారిని దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దమ్మని మధు, సావనపెల్లి శంకర్, గుండ్రెడ్డి రాజు, ఓరుగంటి బాబు, పెద్దపెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పండుగ సాయన్న విగ్రహానికి స్థలం కేటాయించాలి

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనుకు ముదిరాజ్ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కల రాము, NSUI జిల్లా ఇన్‌చార్జి దుద్దెడ భాను, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ముదిరాజ్, మునిగల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, లవకుమార్, ప్రవీణ్, సంతోష్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.