రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్, సెప్టెంబర్ 5:
ముస్తాబాద్‌లోని TGSWREIS పాఠశాలలో శనివారం రోజున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మరియు సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజలింగం వైస్ చైర్మన్ నర్సింలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ఆటల పోటీల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం ఉపాధ్యాయులకు పేరెంట్ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు.
తదుపరి ఉపాధ్యాయులు, పేరెంట్ కమిటీ సభ్యుల పరిచయ వేదికను ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి, విద్యాబోధన, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, విద్యార్థుల క్రమశిక్షణ, వివిధ సబ్జెక్టుల బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు



