కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ భగ్గుమాటు.. ముస్తాబాద్‌లో వంటావార్పు
ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై చేపట్టిన నిరసనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు బొంపల్లి సురేందర్‌రావు, జనగామ శరత్‌రావు సంతు పట్ల అంజిరెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి, మెంగని మనోహర్ రాచమడుగు సంతోష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.


