Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి.. ప్రపంచానికి మన దేశ గౌరవ ప్రతీక భారత రాజ్యాంగం!

దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులకు భరోసానిస్తూ 1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగం మన దేశానికి గర్వకారణం.

ప్రాథమిక హక్కులు, విధులు, భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను అందిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే మన రాజ్యాంగం దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించే మార్గదర్శి.

రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ, హక్కులతో పాటు బాధ్యతలను గుర్తిస్తూ, దేశ ప్రయోజనాలను కాపాడే బాధ్యతగల పౌరులుగా మనమందరం నిలుద్దాం.

భారత రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకుంటూ.. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!

-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా

రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *