Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: పొలిటికల్

ఖమ్మం

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి:బిజెపి

రఘునాథపాలెం /ఖమ్మం ఖమ్మంజిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు రఘునాథపాలెం మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీవోను కలిసి చేయూత పింఛన్లు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులందరికీ అందించాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా వంశీ, ప్రధాన కార్యదర్శి భూక్యా బాలాజీ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం గౌడ్, మండల ఉపాధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, సోషల్ మీడియా కన్వీనర్ గొర్రె సాయి చైతన్య పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

ముదిగొండ/ ఖమ్మం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ప్రతినిధి బృందం ముదిగొండ MROకు వినతిపత్రం సమర్పించింది. బీజేపీ యువమోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, ముదిగొండ మండల బీజేపీ ఇంచార్జి అనంతు ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ చరిత్రను గౌరవించేలా ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని వారు కోరారు.

ఖమ్మం

బిజెపి సేవా సంకల్ప్ అభియాన్.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు..

ఖమ్మం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య లబ్ధిదారులు, పార్టీ మద్దతుదారులు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి ఆశీస్సులు, మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నెల రోజుల కార్యక్రమంలో పాఠశాలల్లో కళా ప్రదర్శనలు, యువ జ్యోతి యాత్రతో పాటు పలు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంద సరస్వతి తెలిపారు.

ఖమ్మం

మామిళ్ళ గూడెం గణనాధుడి పూజ కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియకుల వెంకటనారాయణ

ఖమ్మం మామిళ్లగూడెంలో బీజేపీ నాయకులు వేల్పుల సుధాకర్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల 28వ వార్షికోత్సవ కార్యక్రమాలు 28 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో బీజేపీ ఖమ్మం 2వ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఖమ్మం

వినాయకుడి సన్నిధిలో TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి పట్టణంలోని జవహర్ నగర్‌లోని కృష్ణుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మువ్వా విజయబాబు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఖమ్మం

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరికోటేశ్వరరావు

కొణిజర్ల / ఖమ్మం వినాయక చవితి సందర్భంగా కొణిజర్ల మండలం అనంతారం గ్రామంలోని గణనాథుని పూజా కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు ఖమ్మంలోని తమ స్వగృహంలో వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. వినాయకుని ఆశీస్సులతో కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి, శ్రేయస్సు నెలకొనాలని సండ్ర వెంకట వీరయ్య దంపతులు ఆకాంక్షించారు.

ఖమ్మం

రైతులకు కరెంట్, సాగునీరు ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం: పువ్వాడ అజయ్ కుమార్

రఘునాథపాలెం / ఖమ్మం రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందితే, ప్రస్తుతం కరెంట్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3-ఫేస్‌ విద్యుత్‌ కొరత, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలు మళ్లీ పునరావృతమయ్యాయని ఆరోపించారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్లలో నిలబెడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్‌ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఖమ్మం

దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీ.. పువ్వాడ ఫౌండేషన్ సేవలు

ఖమ్మం రోటరీ క్లబ్, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న సేవలో 1,140 మందికి కృత్రిమ పాదాలు అమర్చినట్లు తెలిపారు. ఈసారి 88 మందికి పాదాలు అందించగా, పువ్వాడ ఫౌండేషన్ రూ.3.52 లక్షలు అందించిందన్నారు. రోటరీ లింబ్ సెంటర్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో రోటరీ ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్, ప్రెసిడెంట్ హరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాళ్ళ పాపారావు, సెక్రటరీ దొడ్డపనేని సాంబశివరావు, వంగల జగన్నాథం, పసుమర్తి రంగారావు, NVNSN ప్రసాద్, చిటోజు రామకృష్ణ, వల్లభనేని రామారావు, RJC కృష్ణ, పగడాల నాగరాజు, బత్తుల మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యం.. టూ టౌన్‌బీజేపీ కార్యవర్గ సమావేశం విజయవంతం..

ఖమ్మం బీజేపీ టూ టౌన్ మండల కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా నిర్వహించారు. టూ టౌన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఇన్‌చార్జి జ్వాలా నరసింహారావు, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, వల్లభనేని పుల్లయ్య, బోయిల వెంకట్, నక్కల రవి గౌడ్, మహేందర్ సింగ్, ఎల్లారావు గౌడ్, బోయినపల్లి సురేష్ గౌడ్, కన్నెకంటి కృష్ణచారి, రుద్రగాని మాధవరావు, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, తుమ్మాటి ఉపేంద్ర, కాసం మమత, దొడ్డపునేని అప్పారావు, దాసరి మధు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.