ముదిగొండ/ ఖమ్మం
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ప్రతినిధి బృందం ముదిగొండ MROకు వినతిపత్రం సమర్పించింది. బీజేపీ యువమోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, ముదిగొండ మండల బీజేపీ ఇంచార్జి అనంతు ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ చరిత్రను గౌరవించేలా ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని వారు కోరారు.


