పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 15:
వేముల మండల పరిధిలో MPTC/ZPTC ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు మంగళవారం ప్రచురించారు. ఈ జాబితాను మండల పరిధిలోని సంబంధిత కార్యాలయాల్లో ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, మండల ఇన్‌చార్జ్‌లు, అధికారిక ప్రతినిధులు, ప్రజలు ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను పరిశీలించి, పోలింగ్ స్టేషన్ల స్థానం, పరిధి తదితర అంశాలపై తమ క్లెయిమ్స్, సూచనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 15, 16 తేదీల్లో సంబంధిత అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు.
ఈ అంశంపై సెప్టెంబర్ 16న ఉదయం 11 గంటలకు వేముల ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, మండల ఇన్‌చార్జ్‌లు, అధికారిక ప్రతినిధులు, ప్రజలు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.
ముసాయిదా పోలింగ్ స్టేషన్ల వివరాలను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని MPDO విజ్ఞప్తి చేశారు.
— మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), వేముల మండలం


