రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఘాటుగా స్పందించారు. బుధవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను ఎండగడుతూ జిల్లాలో వారం రోజులపాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్ మరణాన్ని కోరిన ఎమ్మెల్యే శంకరయ్య సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పగడాల నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు.



