భూ భారతి చట్టంలోని 22A నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రేపు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22A నిబంధనను అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన భూ కబ్జాలకు పాల్పడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. ప్రజా వ్యతిరేకమైన 22Aను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహా ధర్నాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



